: ఇంతవరకు నన్ను ఆమె ఒక్కర్తే కసురుకుంది: ప్రియాంకా చోప్రా
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా అంటే ఇష్టపడని వారెవరుంటారు? ఉండరనుకోకండి... ఎందుకంటే, ఓ మహిళ తనను ఇష్టపడలేదని తనే స్వయంగా చెప్పింది. ఆ వివరాలను వెల్లడిస్తూ... ఓసారి తాను ప్రయాణంలో ఉండగా, చాలా బ్యాగులు మోస్తూ ఓ మహిళ చాలా ఇబ్బంది పడుతోందట. ఆమె బాధను చూసి సహాయం చేయాలని భావించి, ఆమె వద్దకు వెళ్లి బ్యాగులిస్తే సహాయం చేస్తానని ప్రియాంక అడిగిందట. అంతే.. అంతెత్తున లేచిన ఆమె...'ఏం నా బ్యాగులు నేను మోసుకోలేననుకుంటున్నావా? నా పనులు నేను చేసుకోగలను, నీ పనులు నువ్వు చేసుకో' అని సమాధానమిచ్చిందట. దీంతో ప్రియాంక షాక్ కు గురై అక్కడి నుంచి వెనుదిరిగింది. ఆమె తనకు ప్రతిబింబంలా అనిపించిందని, ఆమె ఒక్కరే ఇంత వరకు తనను అలా కసురుకున్నారని ప్రియాంకా చోప్రా చెప్పింది. హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండడం విశేషం.