: అలాంటి యాడ్స్ కు షారుఖ్ బాగా సూట్ అవుతాడు: కరీనా కపూర్


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై నటి కరీనా కపూర్ పొగడ్తల వర్షం కురిపించింది. అమ్మాయిలు, ఆంటీలు అందరూ షారుఖ్ ను అమితంగా ఇష్టపడతారని... అందుకు సౌందర్య ఉత్పత్తుల ప్రచారకర్తగా షారుఖ్ బాగా సూట్ అవుతాడని చెప్పింది. షారుఖ్ తో పాటు తాను ఒక యాడ్ చేశానని... అందులో షారుఖ్ బాత్ టబ్ లో ఉంటే, చుట్టూ అమ్మాయిలు నిల్చుని ఉంటారని, వారిలో తాను కూడా ఉన్నానని తెలిపింది. కాగా, షారుఖ్ కు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో, తమ ఉత్పత్తులకు షారుఖ్ ప్రచారకర్తగా ఉంటే, భారీ సంఖ్యలో వినియోగదారులను ఆకట్టుకోవచ్చని బడా సంస్థలు భావిస్తుంటాయి. షారుఖ్ కూడా పలు సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News