: ఆమె బ్యాంకుకు వెళుతున్నారని తెలిస్తే... ఆమె బదులు నేనే క్యూలో నిలబడేవాడ్ని!: అజాంఖాన్
ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ గురించి తెలియని వారుండరు. నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూ, ఎప్పుడూ పతాక శీర్షికల్లో ఉంటారాయన. తాజాగా ఆయన తన వ్యాఖ్యలతో మరోసారి ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ బ్యాంకుకు వెళుతున్నారని తెలిస్తే, తాను వెళ్లి ఆమె బదులు క్యూ లైన్లో నిలబడేవాడినని చెప్పారు. పెద్దావిడ కష్టపడకుండా చూసేవాడినని అన్నారు. నల్లధనాన్ని బ్యాంకులకు పట్టుకువచ్చేవారి మొహాలకు నల్లరంగు పూయాలని... ఒకసారి ఇలా చేస్తే, మరోసారి నల్లధనాన్ని తీసుకురారని అన్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా నల్లకుబేరులు జంకుతారని చెప్పారు. నిన్న గుజరాత్ లోని గాంధీనగర్ సమీపంలో ఉన్న రాయ్ సన్ గ్రామంలోని ఓ బ్యాంకులో మోదీ తల్లి రూ. 4500లు నగదును మార్చుకున్నారు.