: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం, లోక్ సభ వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతంతో ప్రారంభమైన సమావేశాల్లో దివంగత ఎంపీలకు పార్లమెంటు నివాళులర్పించింది. ఈ సందర్భంగా దివంగత ఎంపీ రేణుకా సిన్హా, ధాయ్ లాండ్ రాజు భుమిభల్ అద్యులతేజ్ తదితరుల మృతికి పార్లమెంటు సంతాపం ప్రకటించింది. అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ మాత్రం కొనసాగుతోంది. నోట్ల రద్దు అంశంలో ఎవరెవరు నోటీసులిచ్చారో చెప్పాలని డిప్యూటీ ఛైర్ పర్సన్ కురియన్ ఎంపీలను అడిగారు.