: కూతురిపై ప్రేమతో పెళ్లి ఖర్చుల నిమిత్తం 10 ఆస్తులను, సింగపూర్ భవంతిని తాకట్టుపెట్టిన గాలి జనార్దన్ రెడ్డి!
మైనింగ్ మాఫియాను నిర్వహించారన్న ఆరోపణలున్నా, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చినా, గాలి జనార్దనరెడ్డి కూడా ఓ ఆడపిల్లకు తండ్రే. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయాలన్న ఆలోచన, ఆయన్ను అప్పుల పాలు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా పెళ్లి ఖర్చు పెడుతున్న ఆయన, డబ్బు కోసం కర్ణాటకలోని 10 ఆస్తులతో పాటు సింగపూర్ లోని ఓ భవంతిని కూడా తాకట్టు పెట్టినట్టు సమాచారం. దాదాపు ఆరు నెలల క్రితమే పెళ్లికి కావాల్సిన ప్రతి పైసానూ సమకూర్చుకుని, మొత్తం డబ్బును ఈవెంట్ మేనేజర్లకు, కాంట్రాక్టర్లకూ అప్పగించినందునే, ఇప్పుడు ఎలాంటి 'నోట్ల రద్దు' అవస్థలు లేకుండా పెళ్లి తంతును గాలి కుటుంబం ఎంజాయ్ చేస్తున్నదని తెలుస్తోంది.