: మరో వివాదంలో దునియా విజయ్ అరెస్టు విడుదల
కన్నడ సినీ నటుడు దునియా విజయ్ మరో వివాదంలో అరెస్టయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే, ఇటీవల వార్తల్లో నిలిచిన 'మాస్తీగుడి' సినిమా నిర్మాత సుందర్ పి.గౌడ సోదరుడు శంకర్ కు భార్య కుటుంబంతో విభేదాలున్నాయి. బెంగళూరుకు చెందిన జయరామ్ అనే వ్యక్తి కుమార్తెను శంకర్ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది కాలానికే అదనపు కట్నం కోసం తన కూతురిని వేధించేవాడని, తన కుమార్తెను చూసేందుకు తమను ఇంటికి కూడా రానిచ్చేవాడు కాదని అతని అత్తమామలు యశోదా, జయరామ్ లు ఆరోపించారు. తాజాగా తన కుమార్తెను చూసేందుకు జయరామ్ ఆమె ఇంటికి వెళ్లగా, శంకర్ అదనపు కట్నం కోసం వాగ్వాదానికి దిగాడని జయరామ్ భార్య యశోద ఆరోపించారు. అంతటితో ఆగని శంకర్ హీరో విజయ్ ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలసి తన భర్తపై దాడికి దిగారని, దునియా విజయ్ తన భర్త జయరామ్ ఛాతీపై బలంగా కొట్టడంతో ఆయన ఛాతి ఎముకలు విరిగాయని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు కెరె పోలీస్ స్టేషన్ లో యశోద ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దునియా విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు.