: మోసుల్ లో బాంబుల మోత... కట్టుబట్టలతో పరుగులు తీసిన 56 వేల మంది
ఇరాక్ లోని కీలక నగరం మోసుల్ బాంబులు, మోర్టార్ షెల్స్, బుల్లెట్ల వర్షంతో మారుమోగుతోంది. నగరంలో తిష్ట వేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టి, ఆ నగరాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసుకునే క్రమంలో అమెరికా-ఇరాక్ సంకీర్ణ సేనలు గత నెల రోజులుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో, సంకీర్ణ సేనలు, ఐఎస్ బలగాల మధ్య భీకర యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గత రెండు వారాల్లో 22,224 మంది మోసుల్ ను వదిలి వెళ్లారు. తాజాగా ఒకేసారి 56 మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో మోసుల్ ను వదిలి వెళ్లారు. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు దాదాపు వెయ్యికి పైగా టెంట్లను రెడీ చేశారు.