: చిల్లర లేదు, నోట్లు లేవు... గయలో ఉచిత పిండ ప్రదాన సేవలు చేస్తున్న పురోహితులు!


బీహార్ లోని గయ... పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే, వారికి సద్గతులు సంప్రాప్తిస్తాయని హిందువుల నమ్మకం. కాశీకి వెళ్లిన వారిలో అత్యధికులు గయకు కూడా వెళ్లి అక్కడ పిండప్రదానం చేసి వస్తారు. ఇక దేశంలో పెద్ద నోట్లు రద్దయి, ఉన్న నోట్లకు చిల్లర దొరకని పరిస్థితి ఏర్పడిన వేళ, ఆ ప్రభావం గయలోని పురోహితులపైనా పడింది. యాత్రికులు తీసుకువచ్చే పాత కరెన్సీని తీసుకోలేక, వారికి చిల్లర ఇవ్వలేక పిండ ప్రదాన సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు గయ పండితులు చెబుతున్నారు. ఇక తమ వద్ద సరిపడా చిల్లర లేకున్నా, బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోలేకున్నా విష్ణుపాదం ఆలయ అధికారులు సహకరిస్తున్నారని భక్తులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News