: కరెన్సీ ముద్రణకు ఇంక్, సిల్వర్ థ్రెడ్... భారత్, పాక్ లకు సరఫరాదారు ఒకరే: అసదుద్దీన్ ఆరోపణ
ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో ముద్రిస్తున్న కరెన్సీ నోట్లకు అవసరమయ్యే ఇంకు, సిల్వర్ థ్రెడ్ లను సరఫరా చేస్తున్నది ఒకే కంపెనీ అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ విషయంలో కనీస వ్యూహం కూడా లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ కు ఇంకు, సిల్వర్ దారం అందిస్తున్న వారితోనే ఇండియా కూడా కాంట్రాక్టు కుదుర్చుకోవడం వెనుక కారణమేంటని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు తరువాత ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారని, పాత నోట్లను మార్చుకునేందుకు కనీసం రెండు నెలల గడువిస్తే పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉండేదని, ఎవరైనా పెద్ద మొత్తాలు డిపాజిట్ చేస్తుంటే గమనించి పట్టుకునే విధంగా యంత్రాంగాన్ని ముందు నిలిపి నోట్ల మార్పిడికి మరింత సమయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.