: రూ. 500 'రౌండ్ ఫిగర్' డీల్... వైన్స్ అండ్ బార్స్ నయా ట్రెండ్
చలామణిలో ఉన్న పెద్ద నోటు రూ. 2 వేలకు చిల్లర ఇచ్చుకోలేక, అవస్థలు పడుతున్న తెలుగురాష్ట్రాల్లోని మద్యం వ్యాపారులు సరికొత్త ట్రెండ్ కు తెరలేపారు. తగ్గిన మద్యం విక్రయాలను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లు ఇస్తున్నారు. రూ. 500, రూ. 1000 రౌండ్ ఫిగర్ బిల్లులకు ఆఫర్లు ఇస్తున్నారు. ఉదాహరణకు రూ. 500తో వస్తే, ప్రీమియం బ్రాండ్ కు చెందిన లిక్కర్ అరలీటరు, ఓ లీటర్ వాటర్, మరో లీటర్ సోడా, స్నాక్స్ ఇస్తారు. ఇక రూ. 1000 తీస్తే, ఫుల్ బాటిల్, రెండు లీటర్ల వాటర్, సోడా, స్నాక్స్... ఇలా వైన్స్ షాపులు ఇస్తున్న ఆఫర్లతో గడచిన వారం రోజులుగా తగ్గిన కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు తరువాత 50 శాతం వరకూ అమ్మకాలు తగ్గినట్టు అంచనా.