: 97 ఏళ్ల తల్లితో రాజకీయాలా?... నా తల్లి కోసం అయితే నేను క్యూలో నిల్చునే వాడిని: కేజ్రీవాల్
రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు ప్రధాని తల్లి హీరాబెన్ గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ఓ బ్యాంకు వద్దకు తన సహాయకులతో వచ్చి క్యూలో నిల్చోవడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ 97 ఏళ్ల తల్లిని క్యూలైన్లో నిలబెట్టి రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఒకవేళ తనకు ఆ పరిస్థితి వస్తే... తన తల్లికి బదులుగా ఆ క్యూ లైన్లో తానే నిలబడతానని తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా వ్యంగ్యోక్తులు వ్యక్తమయ్యాయి. ఎనిమిది మంది సహాయకుల సాయంతో బ్యాంకుకు వెళ్లే బదులు, వారిలో ఎవరో ఒకర్ని పంపిస్తే ఆ డబ్బులు తెచ్చిచ్చేవారు కదా? అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించడం విశేషం.