: పెద్ద నోట్ల రద్దు, యూరీ ఘటన, కశ్మీర్ సంక్షోభంపైనే పార్లమెంటులో చర్చ: కేకే


500, 1000 రూపాయల నోట్ల రద్దు, యూరీ ఉగ్రదాడి, కశ్మీర్‌ సంక్షోభం అంశాల కేంద్రంగా పార్లమెంట్‌ లో చర్చ జరగనుందని టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. నోట్లు రద్దు చేస్తున్న సమయంలో ఏర్పడ్డ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఆర్బీఐ అన్వేషించకపోవడం వల్లే ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్ణయం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం కారణంగా సంక్షేమ పథకాలకు ఇబ్బంది ఏర్పడిందని ఆయన చెప్పారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయనున్నారో కేంద్ర ఆర్థిక మంత్రి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News