: నోట్ల రద్దును పార్లమెంటులో చర్చిస్తాం: రాహుల్ గాంధీ


500, 1000 నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అన్న అనుమానం ఉందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. పెద్దనోట్లు రద్దు అని ఢంకా బజాయించి చెబుతున్న మోదీ ప్రభుత్వం, అదే సమయంలో అంతకంటే పెద్దనోట్లను ఎందుకు వినియోగంలోకి తెచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం ప్రకటించడానికి ముందు పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ అకౌంటుకి పెద్ద మొత్తంలో క్రెడిట్ అయిందని అన్నారు. దీనిని బట్టి పెద్దనోట్ల రద్దు వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పవచ్చని ఆయన అన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చను లేవనెత్తుతామని ఆయన అన్నారు. ఏటీఎంలు, బ్యాంకులకు క్యూకట్టేవారిలో నల్ల కుబేరులెందరున్నారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News