: పెద్ద నోట్ల రద్దు వెనుక భారీ కుంభకోణం ఉంది: గులాం నబీ ఆజాద్
500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన సమాచారం కొంత మందికి ముందే అందిందని ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దు విషయం కొంత మందికి ముందే ఎలా తెలిసింది? అనే అంశాన్ని లేవనెత్తుతామని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని లోక్ సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేవనెత్తుతారని ఆయన చెప్పారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.