: సినిమా నటి.. రాజకీయ వేత్త.. ఇప్పుడు పైలట్!
కలలను సాకారం చేసుకోవడమంటే ఏంటో ప్రముఖ సినీ నటి గుల్ పనాగ్ ను చూస్తే తెలుస్తుంది. మోడలింగ్ నుంచి బాలీవుడ్ కి వచ్చి, ఆ తర్వాత సినిమాల ద్వారా దేశం మొత్తానికి పరిచయమైన గుల్ పనాగ్ ఆ తరువాత దేశానికి సేవచేయాలన్న లక్ష్యంతో పంజాబ్ రాజకీయాల్లో ప్రవేశించింది. ఆమ్ ఆద్మీ తరపున ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైంది. అనంతరం పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసి లైసెన్స్ పొందింది. వివిధ రంగాల్లో అభిరుచిని పెంపొందించుకుని వైవిధ్యాన్ని చాటడంలోనూ, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడంలోనూ గుల్ పనాగ్ ఇప్పుడు ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తోంది.