: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసిన రతన్ టాటా


కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఈరోజు సమావేశమయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించినప్పటి నుంచి వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జైట్లీతో రతన్ టాటా సమావేశమవడం గమనార్హం. సుమారు అరగంటసేపు జరిగిన వారి సమావేశంలో ఏ విషయాలపై చర్చించారన్నది బయటకు రాలేదు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడేందుకు టాటా నిరాకరించారు. ఈ భేటీలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పాల్గొంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీని కూడా రతన్ టాటా సమావేశం కానున్నట్లు సమాచారం. అలాగే, సైరస్ మిస్త్రీ కూడా ప్రధాని, ఆర్థిక మంత్రులను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News