: అప్పటికీ, ఇప్పటికీ చైతన్య చాలా మారాడు: గౌతమ్ మీనన్


'ఏం మాయ చేశావే' సినిమా నాటికి, 'సాహసం శ్వాసగా సాగిపో' నాటికి నాగచైతన్య చాలా మారాడని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమా సమయంలో ప్రతి సీన్ చెప్పి చేయించుకోవాల్సి వచ్చిందని, ఈ సినిమాకు అలా కాదని, ప్రతి సీన్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేశాడని కితాబునిచ్చారు. తనకు తెలుగు చాలా బాగా అర్థమవుతుందని, మాట్లాడలేనప్పటికీ తనకున్న అద్భుతమైన టీమ్ కోన వెంకట్ రాసిన డైలాగులను ఫిల్టర్ చేసిందని, అందువల్లే డైలాగులు ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ సినిమాకు ఆకట్టుకునే కథ కుదరడంతోనే చివర్లో తాను కూడా కనిపించానని అన్నారు.

  • Loading...

More Telugu News