: పైలట్ క్యాబిన్ లోపలికి వెళ్లి ఒక్కసారిగా లైట్ వేసిన వ్యక్తి.. కుదుపులకు గురైన విమానం
గత రాత్రి చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో జెట్ ఎయిర్‌వేస్ విమానం కుదుపులకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా పైలట్ క్యాబిన్‌లోకి వచ్చి లైట్ వేశాడు. దీంతో వెలుతురు ధాటికి పైలట్ ఇబ్బంది పడడంతో విమానం కుదుపులకు గురైంది. విమానం ల్యాండ్ అవగానే పైలట్ ఎయిర్‌పోర్టు అధికారులకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, పోలీసులు ఘటనపై ఆరాతీస్తున్నారని చెప్పారు.