: నా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను!: ముద్రగడ పద్మనాభం
గృహ నిర్బంధం నేపథ్యంలో తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తనను 48 గంటల పాటు గృహ నిర్బంధంలో ఉంచుతామని పోలీసులు చెప్పారని, ఆ తర్వాత వారు ఏమి చెబుతారనే విషయమై వేచి చూస్తున్నానని అన్నారు. కాగా, కిర్లంపూడిలోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను పోలీసులు కదలనివ్వలేదు. అరాచకశక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని, అందుకే, ఇంటి నుంచి ఆయన్ని బయటకు కదలనివ్వలేదని పోలీసులు చెప్పారు.