: సూపర్‌మూన్‌తో కలిసి సెల్ఫీ దిగి పోస్ట్ చేసిన షారుఖ్ ఖాన్
కార్తీక పౌర్ణమి రోజున (సోమవారం) గగనంలో నిండు చందమామ సాధారణం కన్నా ప్రకాశవంతంగా, పెద్దగా కనపడిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఆ సూపర్ మూన్‌ని చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తుండగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా అదే పని చేశాడు. షారుక్ సరదాగా ఆ నిండు చంద్రుడితో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసి తన అభిమానులతో పంచుకున్నాడు. ‘చంద్రుడు ఈరోజు పెద్దగా కనిపిస్తూ అధికంగా వెలుగులు చిమ్ముతున్నాడు’ అంటూ కామెంట్ కూడా పెట్టాడు.