: ఆ సంచలన కథనం ఫేక్... 6000 కోట్లు కాదు, 6 పైసలు కూడా ప్రభుత్వానికివ్వలేదు: లాల్జీ పటేల్ ప్రకటన


గుజరాత్ లోని సూరత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి, బిల్డర్ లాల్జీ భాయ్ పటేల్ 6000 కోట్ల రూపాయల పెద్ద నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని అంటూ వచ్చిన కథనాలన్నీ ఫేక్ అని తేలిపోయింది. లాల్జీ భాయ్ పటేల్ గతంలో మోదీకి ఖరీదైన సూట్ బహుమతిగా ఇచ్చారు. అలాగే తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు కార్లు, ఇళ్లు కానుకగా ఇచ్చారు. దీంతో ప్రభుత్వానికి 6000 కోట్ల రూపాయలు స్వాధీనం చేయడం కూడా వాస్తవమేమోనని భ్రమించిన మీడియా కూడా ఆయనపై, ఆయన ఉదారతపై పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో అవాక్కైన ఆయన మీడియా సమావేశం పెట్టి... తాను ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ప్రకటించారు. అవన్నీ పుకార్లని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. దీంతో అంతా అవాక్కయ్యారు. దీంతో నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి విషయాలు షేర్ చేయవద్దని, పుకార్లను వ్యాపింపచేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News