: ఆ ఏటీఎం చనిపోయిందంటూ.. పుష్ప నివాళి!


పాతనోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని, ఏటీఎంలలో వంద నోట్లు తీసుకోవచ్చని కేంద్రం పేర్కొన్న విషయం విదితమే. అయితే, ఏటీఎంల ద్వారా తగినన్ని వందనోట్లు ఖాతాదారులు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. మరోపక్క, దేశ వ్యాప్తంగా ఏటీఎం సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో, ఖాతాదారులకు దిక్కుతోచని స్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో కేరళలోని కన్నూరు జిల్లాలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. అక్కడి ఏటీఎం పనిచేస్తోందనే వార్తలు రావడంతో చాలా మంది ఖాతాదారులు అక్కడికి చేరుకుని క్యూలో నిలబడ్డారు. కొంచెంసేపటి తర్వాత, ఆ ఏటీఎంలో కూడా డబ్బులు అయిపోయాయి. దీంతో, అక్కడ ఉన్న వారు సహనం కోల్పోయారు. తమ అసహనాన్ని వెరైటీగా వ్యక్తం చేశారు. అంత తొందరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయినందుకు విచారిస్తున్నామని, మన ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారని, తిరిగి రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఒక కాగితంపై రాసి దానిని ఏటీఎంకు వేసిన పూలమాలకు అతికించడం ద్వారా ఖాతాదారులు తమ నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News