: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై ఛీటింగ్ కేసు?
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓన్లర్లు శిల్పాశెట్టి, భర్త రాజ్ కుంద్రా తనను మోసం చేశారంటూ జైపూర్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ అనంద్ సింగ్ ఆరోపణలు చేశారు. ఓ క్రికెట్ టాలెంట్ హంట్ పోటీకి సంబంధించి రూ.8 లక్షల విషయంలో తనను మోసం చేశారంటూ కోర్టు కెళ్లారు. జైపూర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.