: ముద్రగడను ఇంటి లోపలికి తీసుకువెళ్లిన పోలీసులు


తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పాదయాత్ర నిర్వహించేందుకు తన నివాసం నుంచి బయలుదేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఆదిలోనే చుక్కెదురైంది. కిర్లంపూడిలోని తన నివాసం నుంచి రావులపాలెం బయలుదేరిన పద్మనాభంకు ‘ఇంటి నుంచి బయటకు వెళ్ల వద్దు’ అని పోలీసులు సూచిస్తూ.. ఆయన్ని ఇంట్లోకి తీసుకువెళ్లారు. అరాచక శక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో, ‘నన్ను గృహనిర్బంధం చేస్తున్నారా?’ అని పోలీసులను ముద్రగడ ప్రశ్నించారు. దీంతో, పోలీసులకు వ్యతిరేకంగా ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు. కిర్లంపూడి, రావులపాలెం, అమలాపురంలో ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News