: బీజేపీ, టీడీపీలు తలచుకుంటే అది సాధ్యమవుతుంది: కడియం శ్రీహరి
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని... ఇదే విధంగా ఏపీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీజేపీ, టీడీపీలు తలచుకుంటే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల ఢిల్లీలో మాట్లాడారని... దీంతో ఆయనను అంబేద్కర్ తో పోల్చారని... అది తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. దయచేసి ఎవరినీ అంబేద్కర్ తో పోల్చవద్దని కడియం శ్రీహరి విన్నవించారు.