: హైదరాబాద్ లో విషాదం.. బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఖాతాదారుడి మృతి
ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం వరసగా ఏడో రోజు బ్యాంకులు, ఏటీఎంల ముందు ఖాతాదారుల రద్దీ కనిపిస్తోంది. బ్యాంకుల ముందు గంటలతరబడి నిలబడడంతో కొందరు వ్యక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని మారేడుపల్లిలోని ఆంధ్రా బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీనారాయణగా గుర్తించారు. నగదు మార్పిడి కోసం రెండు గంటలపాటు ఆయన క్యూలో నిలబడినట్లు తెలుస్తోంది.