: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దీంతో, ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయి 26,304 పాయింట్లు వద్ద; నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 8,108 పాయింట్లు వద్ద ముగిశాయి. ఎస్ బీఐ, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్ యూఎల్ సంస్థల షేర్లు లాభపడగా, టాటా మోటార్స్,ఏషియన్ పెయింట్స్, మారుతీ, టాటా స్టీల్, హెచ్ డీఎఫ్ సీ సంస్థల షేర్లు నష్టపోయాయి.