: కర్నూల్ ఆర్డీవో కార్యాలయంపై రాళ్ల దాడి


సౌరవిద్యుత్ ప్లాంట్ కారణంగా భూములు కోల్పోయిన బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ కర్నూల్ ఆర్డీవో కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని శకునాల, గని, దేవనూర్, సున్నంపల్లి రైతులు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ భూములు తీసుకుంది కానీ, నష్టపరిహారం ఇంత వరకూ చెల్లించ లేదంటూ మండిపడ్డారు. అయితే, బాధితులను చూసిన అధికారులు ఆర్డీఓ కార్యాలయం తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారు. దీంతో, మరింత ఆగ్రహించిన బాధితులు, కార్యాలయంపై రాళ్ల వర్షం కురిపించారు. తలుపులు విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో బాధితులు శాంతించారు.

  • Loading...

More Telugu News