: మేలో అఖిల్ పెళ్లి.... ఆగస్టులో నాగచైతన్య, సమంత వివాహం
టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంత వివాహ తేదీ ఇంచుమించు ఖరారైనట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9న అఖిల్ అక్కినేని, శ్రియ భూపాల్ వివాహ నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించడంలో అక్కినేని నాగార్జున బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం వచ్చే మేలో రోమ్ లో జరగనుందని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ క్రమంలో వచ్చే ఆగస్టులో నాగచైతన్య, సమంతల వివాహం జరగనుందని, తొలుత హిందూ సంప్రదాయంలో వివాహం జరిగిన అనంతరం క్రైస్తవ పధ్ధతిలో జరగనుందని తెలుస్తోంది. దీంతో అక్కినేని వారింట డిసెంబర్ లో మొదలైన వివాహ సందడి ఆగస్టు వరకు కొనసాగేలా కనిపిస్తోంది.