: ఆసీస్ టీమ్ లో నలుగురు మినహా... అందరికీ ఉద్వాసన తప్పదట
వరుసగా ఐదు టెస్టులను కోల్పోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాక్ కు గురయింది. చివరకు సొంత గడ్డపై కూడా దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి, సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమ్ కోచ్ డారెల్ లీమన్ మాట్లాడుతూ, ప్రస్తుత జట్టులో ఉన్న నలుగురి స్థానాలపై మాత్రమే భరోసా ఇచ్చాడు. మిగిలిన వారందరిపై వేటు తప్పదని స్పష్టం చేశాడు. అయితే, ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరనే విషయం మాత్రం లీమన్ వెల్లడించలేదు. ఇంత దారుణంగా ఆస్ట్రేలియా ఆడటం ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా ఈ వరుస ఓటమిలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని... అత్యుత్తమ 11 మంది ఎవరనే దానిపై వర్కవుట్ చేస్తున్నామని చెప్పాడు.