: అలియా భట్ కు కాబోయేవాడు ఇలా ఉండాలట!
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో బాలీవుడ్ నటి అలియా భట్ వెల్లడించింది. అతను హాట్ గా ఉండాల్సిన అవసరం లేదని... మనసులు దోచుకోవాల్సినంత అందం అవసరం లేదని... యూత్ ఐకాన్ కావాల్సిన అవసరం లేదని చెప్పింది. మనసున్నవాడై ఉండాలని, ఫన్నీగా ఉండాలని, తనను బాగా ప్రేమించాలని, మంచి లక్షణాలు కలిగినవాడై ఉండాలని తెలిపింది. తన తాజా చిత్రం 'డియర్ జిందగీ'ని ప్రేక్షకులు ఇష్టపడతారని చెప్పింది. తనకు ప్రేక్షకులు ఇచ్చే అవార్డులు, రివార్డులే ముఖ్యమని తెలిపింది.