: పెద్ద‌నోట్ల ర‌ద్దుతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నది నిజం కాదా?: కిషన్ రెడ్డి


కాంగ్రెస్ పాలించిన 70 ఏళ్లలో దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేత, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. త‌మ ద‌గ్గ‌రున్న‌ న‌ల్ల‌ధ‌నం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న ఆందోళనతోనే కాంగ్రెస్ నేత‌లు ధ‌ర్నాలు చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. దేశంలో కూరుకుపోయిన‌ అవినీతిని నిర్మూలించేందుకే ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ కృషి చేస్తున్నారని, అందుకే కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్లను ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఆయ‌న అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవ‌డానికి కారణం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుస‌రిస్తోన్న విధానాలేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌న్నులు క‌ట్టే వారి సంఖ్య పెరిగింద‌ని, ఆదాయం స‌మ‌కూరుతున్న‌ది వాస్త‌వం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News