: నాకే పాపం తెలియదు... ఆ అమ్మాయికి భర్తతో ఏం గొడవో?: పోలీసుల ముందు మీడియాతో ప్రొఫెసర్ లక్ష్మి
నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన సంధ్యారాణి హత్యకేసు నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మిని మీడియా ముందు ప్రవేశపెట్టగా, తనకే పాపం తెలియదని లక్ష్మి బుకాయించారు. పోలీసుల ఎదుట మీడియాతో మాట్లాడిన ఆమె, "ఇన్ని సంవత్సరాలు నేను అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, ప్రొఫెసర్ గా పనిచేశాను. ఎప్పుడూ ఏ కంప్లయింటూ రాలేదు. పిల్లలందరికీ నేనంటే చాలా ఇష్టం. కానీ ఈ అమ్మాయి నేను చెప్పేది అర్థం చేసుకోలేకనో లేక... బేసిక్ గా ఆ అమ్మాయికి ఇష్టం లేదు. వాళ్ల హజ్బండ్ ఒత్తిడితో ఆమె కోర్సు తీసుకుంది. భర్తతో ఏం గొడవో? నేను మాత్రం ఏ తప్పూ చేయలేదండీ" అని చెప్పారు. ఆపై పోలీసులు లక్ష్మి, ఆమె భర్త, కుమారుడు సహా పారిపోయేందుకు ఆమెకు సహకరించిన వారిని కోర్టు ముందు హాజరు పరిచారు.