: ఏడుగురు జవాన్లను చంపారు... భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాం: హెచ్చరించిన పాకిస్థాన్


వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపి, తమ జవాన్లలో ఏడుగురిని పొట్టన బెట్టుకుందని నిన్న ఆరోపించిన పాకిస్థాన్, ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. తమ వారిని చంపారని పాక్ అంగీకరించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కాగా, "అంతర్జాతీయ కమ్యూనిటీ ఇకనైనా భారత్, పాక్ మధ్య దృష్టిని సారించాలి. ఈ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది" అని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా మొహమ్మద్ ఆసిఫ్, జియో న్యూస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. కాగా, ఎల్ఓసీ పై ఉన్న భీమ్ బర్ సెక్టారులో పాక్ హెవీ వెపన్స్ తో కాల్పులు జరుపగా, భారత సైన్యం దీటుగా స్పందించిందని, అటువైపు జరిగిన నష్టం గురించిన సమాచారం తమ వద్దలేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News