: ప్రొఫెసర్ లక్ష్మి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరిగిన ప్రదేశాలివే!


నిందితులు సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నప్పటికీ, కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎనిమిది పోలీసు బృందాలు ప్రొఫెసర్ లక్ష్మి దంపతులను చాకచక్యంగా అరెస్ట్ చేశారని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా, ఈ 22 రోజుల్లో వారు పుణ్యక్షేత్రాలు సహా 16 ప్రాంతాలను సందర్శించారని, ఎక్కడా ఒక్క రోజుకు మించి ఉండలేరని తెలిపారు. గుంటూరు నుంచి బయలుదేరిన వీరు పుల్లల చెరువు, పాండిచేరి, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, షిరిడి, శనిసింగనాపూర్, పండరీపురం, షోలాపూర్ వెళ్లి తిరిగి హైదరాబాదుకు వచ్చి.. అటు నుంచి కర్నూలు, మంత్రాలయం, అనంతపూర్, బెంగళూరు, మైసూర్ వెళ్లి, మళ్లీ బెంగళూరుకు వచ్చారని తెలిపారు. దీన్ని ప్రొఫెషనల్ చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కొంత ఆలస్యమైనా నిందితులను అరెస్ట్ చేశారని వివరించారు.

  • Loading...

More Telugu News