: పాత రూ. 500 తెండి, మా సినిమా చూడండి: ప్రేక్షకులకు కన్నడ చిత్ర టీమ్ ఆఫర్
పెద్ద నోట్లు రద్దయిన వేళ, సినిమాలకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయన్న ఆందోళన నెలకొన్న వేళ, ఓ కన్నడ చిత్రం టీమ్ బంపరాఫర్ తో వచ్చింది. ఈ నెలలో విడుదల కానున్న 'నటరాజ సర్వీస్' చిత్రాన్ని రద్దయిన రూ. 500 నోట్లు తెచ్చి చూడవచ్చని దర్శకుడు పవన్ ఒడయార్ వెల్లడించారు. పాత నోట్లను ఎలా మార్చుకోబోతున్నారన్న ప్రశ్నకు మాత్రం జవాబివ్వని ఆయన, తమ నిర్ణయం ప్రేక్షకులను థియేటర్లవైపు నడిపిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు. ఇక ఆయన నమ్మకం ఏ మేరకు నిజమవుతుందో చిత్రం విడుదలైన తరవాతనే తెలుస్తుంది.