: క్యూలో గంటల కొద్దీ నిలుచొని అసహనం పెరిగిన వేళ... ఆమె చేసిన అసభ్య పనితో వెంటనే డబ్బులొచ్చేశాయి!


పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు గంటలు గంటలు పడిగాపులు పడి తీవ్ర అసహనానికి లోనైన ఓ యువతి, అర్ధనగ్నంగా తన నిరసనను వ్యక్తం చేయగా, ఆమెకు వెంటనే డబ్బులొచ్చేశాయి. తన వంతు వచ్చే వరకూ డబ్బులు ఉంటాయో, ఉండవోనన్న అనుమానంతో ఆమె చేసిన హంగామా, చుట్టుపక్కలున్న ఆడవాళ్లు సర్దిచెప్పాలని చూసినా ఆగలేదు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, బట్టలు ఊడదీస్తూ నిరసన తెలుపుతుంటే, ఎవరో పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఆమెకు వెంటనే డబ్బులిచ్చి పంపాలని, ఆమెకు డబ్బిస్తే, ఈ హంగామా ఉండదు కదా? అని పోలీసు వర్గాల నుంచి వచ్చిన సమాధానంతో, బ్యాంకు అధికారులు వెంటనే ఆమెకు డబ్బిచ్చి పంపారు. ఆమె చేసిన పని సభ్య సమాజం హర్షించే పని కానప్పటికీ, ప్రజల్లో పెరుగుతున్న అసహనానికిది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News