: బెయిల్ వచ్చే వరకూ పారిపో... ప్రొఫెసర్ లక్ష్మికి సలహా ఇచ్చిన పోలీసు అధికారి, రిటైర్డ్ జడ్జి


గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య తరువాత, ప్రొఫెసర్ లక్ష్మిని పారిపోవాలని సలహా ఇచ్చిన వారు ఎవరన్న విషయమై పోలీసులు కూపీ లాగారు. ఓ పోలీసు అధికారి, రిటైర్డ్ జడ్జి ఆమెకు సలహా ఇచ్చారని, బెయిల్ వచ్చే వరకూ పోలీసులకు లొంగిపోకుండా పారిపోవాలని వారు చెప్పిన మాట వినే, లక్ష్మి దంపతులు గుంటూరును వీడి వెళ్లారని పోలీసు వర్గాలు విచారణలో తెలుసుకున్నాయి. ఇక గుంటూరును వీడిన ఈ దంపతులు 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో తిరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కాగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేయలేదని, కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఆమె లొంగిపోయారని న్యాయవాది వైకే వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News