: మళ్లీ కరుణానిధే సీఎం అవుతారు: అళగిరి
డీఎంకే అధినేత కరుణానిధే మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన పెద్ద కుమారుడు అళగిరి చెప్పారు. గత కొంతకాలంగా తన తండ్రికి, డీఎంకే పార్టీకి దూరంగా ఉన్న అళగిరి... తన తండ్రి అనారోగ్యానికి గురైన తర్వాత ఆయనను మూడు సార్లు కలిశారు. రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాలకు జరుగుతున్న ఉపఎన్నికలో తన మద్దతుదారుల పాత్ర గురించి తండ్రికి వివరించారు. ఈ క్రమంలో, ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కరుణానిధి వేగంగా కోలుకుంటున్నారని... బాగా మాట్లాడుతున్నారని చెప్పారు. తన తండ్రితో తన భేటీకి ఇతర కారణాలేమీ లేవని... కేవలం ఆరోగ్యం గురించి విచారించడం కోసమే ఆయను కలిశానని తెలిపారు. తమ ముఖ్యమంత్రి ఎప్పుడూ ఆయనే అని... మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మరోవైపు, అళగిరిని మళ్లీ డీఎంకేలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా జోరందుకుంది.