: ప్రొఫెసర్ లక్ష్మిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు


మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఆమెను గుంటూరుకు తీసుకొచ్చారు. ఈ రోజు 11 గంటలకు ఆమెను మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంట్లో లక్ష్మి దంపతులు ఉన్నారన్న సమాచారంతో, ప్రత్యేక పోలీసులు నిన్న ఆ ఇంటిపై దాడి చేసిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ పోలీసులకు దొరక్కుండా 22 రోజుల పాటు ఐదు రాష్ట్రాలను చుట్టేశారు. మరోవైపు, లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేయడం బూటకమని... బెయిల్ కోసం జిల్లా కోర్టు, హైకోర్టుల్లో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె పోలీసులకు లొంగిపోయారని న్యాయవాది వైకే తెలిపారు.

  • Loading...

More Telugu News