: రష్యా అత్యున్నత విచారణ సంస్థ అదుపులో ఆ దేశ ఆర్థిక మంత్రి


రష్యా ఆర్థిక మంత్రి అలెక్సీ ఉల్యుకేవ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. రెండు మిలియన్ డాలర్లను ఆయన లంచంగా తీసుకున్నట్టు తెలియడంతో, ఆయనను విచారించేందుకు... రష్యాలో ఉన్నత స్థాయి కేసులను పరిశీలించే 'రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ' ఆయనను అదుపులోకి తీసుకుంది. అలెక్సీపై విచారణ ప్రారంభమయిందని రష్యా ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ రాస్నెట్ మరో కంపెనీ బాష్ నెట్ ను కొనుగోలు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ఆయన ఈ లంచం తీసుకున్నారు. నవంబర్ 14న అంటే నిన్న (సోమవారం) ఆయన లంచం తీసుకున్నట్టు తెలిసిందని అధికారులు తెలిపారు. ఆర్థిక మంత్రి చర్యను తాము చాలా సీరియస్ గా తీసుకున్నామని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు.

  • Loading...

More Telugu News