: సౌదీ స్కూళ్లలో ముస్లిం పండుగలకు మాత్రమే సెలవులు.. ఇతర మతాల పండుగలకు సెలవులు రద్దు


సౌదీ అరేబియాలోని స్కూళ్లలో ఇతర మతాల పండుగలకు సెలవులు ఇవ్వడాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సౌదీ విద్యాశాఖ అన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి వాటికి సెలవులు ప్రకటించరాదని సోమవారం ఆదేశించింది. ఇతర మతాల పండుగలకు సెలవులు ప్రకటిస్తూ అందుకు తగ్గట్టుగా పరీక్షల టైం టేబుళ్లను స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టానుసారం మార్చివేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించే స్కూళ్ల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక నుంచి అన్ని స్కూళ్లలో తప్పనిసరిగా పరీక్షలు, సెలవులతో కూడిన అకడమిక్ క్యాలెండర్‌ను అతికించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News