: ట్విట్టర్ లో 'రేప్ మెలానియా' ప్రచారం... తొలగించని ట్విట్టర్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ వర్గం ప్రజలు నిర్వహిస్తున్న నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీస్తుండగా, తాజాగా, కొలంబియా ప్రాంతంలో జరిగిన నిరసనల్లో ట్రంప్ సతీమణి, కాబోయే ఫస్ట్ లేడీ మెలానియాపై అత్యాచారం చేయాలంటూ 'రేప్ మెలానియా' అని రాసున్న ప్లకార్డులు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ టాపిక్స్ లో 'రేప్ మెలానియా' ముందు నిలిచింది. ఎంతో మంది ట్విట్టర్ ఖాతాదారులు ఈ ప్రచారాన్ని చూసి, అభ్యంతరకరమైన దీన్ని తొలగించని ట్విట్టర్ యాజమాన్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ, ఈ ప్రచారం, లైంగిక హింసను ప్రజలు ప్రోత్సహిస్తున్నట్టుగా అర్థం చేసుకోరాదని, తమ అసంతృప్తిని తెలుపుతున్నారని మాత్రమే భావించాలని, అందుకే దీన్ని కొనసాగిస్తున్నామని పేర్కొంది. కేవలం ఒకరిద్దరు నిరసనకారులు చూపిన ఈ ప్లకార్డుల గురించి అందరినీ అనడం భావ్యం కాదని ట్రంప్ వ్యతిరేక వర్గం అంటోంది.