: రూ.500 నోట్లు వెయ్యి కోట్లు.. రూ.100 నోట్లు 500 కోట్లు పంపండి.. కేంద్రానికి బాబు లేఖ


నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరింత చొరవ తీసుకున్నారు. ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి రూ.1500 కోట్ల విలువైన కరెన్సీ పంపాలని కోరుతూ లేఖ రాశారు. కేంద్రం పంపే కరెన్సీ డినామినేషన్ ఎలా ఉండాలో కూడా అందులో వివరించారు. రూ.వెయ్యి కోట్ల విలువైన రూ.500 నోట్లు, రూ.500 కోట్ల విలువైన రూ.100 నోట్లు తక్షణమే రాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News