: పరువు నష్టం కేసులో రేపు థానే కోర్టుకు రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు థానే కోర్టులో పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరుకానున్నారు. వివరాల్లోకి వెళ్తే...2014 ఎన్నికల సందర్భంగా ముంబై శివారులో జరిగిన బహిరంగ సభలో ‘గాంధీ మహాత్ముడిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తులే హత్య చేశారని’ ఆరోపించారు. దీంతో ఆయనపై మహారాష్ట్రలోని థానే కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు లాయర్ ద్వారా సమాధానం చెప్పిన రాహుల్ ను స్వయంగా హాజరు కావాలని థానే కోర్టు ఆదేశించడంతో ఆయన రేపటి విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. నేటి రాత్రి ముంబైలో బస చేసి, రేపు ఉదయం న్యాయస్థానంలో విచారణకు హాజరుకానున్నారు.