: 220 ఏళ్ల నాటి తియ్యని బీరుకు ప్రాణప్రతిష్ఠ చేసిన శాస్త్రవేత్తలు
ప్రపంచంలోనే అత్యంత పురాతన బీరును శాస్త్రవేత్తలు పునఃప్రతిష్ఠ చేశారు. పురాతన బీరు అంటే అలాంటిలాంటిది కాదు. సుమారు 220 ఏళ్ల క్రితం నాటి బీరు. 1797లో భారత్ లోని కోల్ కతా పోర్టు నుంచి ఆస్ట్రేలియాలోని పోర్ట్ జాక్సన్ కు వెళ్తున్న బ్రిటిష్ వ్యాపారికి చెందిన నౌక తుపాను కారణంగా టాస్మానియా ద్వీపం సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి పడవ సిబ్బంది తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. వీరి దగ్గర ఒక బీరును శాస్త్రవేత్తలు సంపాదించారు. 18వ శతాబ్దానికి చెందిన ఆ మత్తు పానీయం యొక్క శిలీంద్రాన్ని (ఈస్ట్) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి కొత్త బీరుకు రూపకల్పన చేశారు. ఇది చాలా తీయగా, పళ్ల రసాన్ని పోలి ఉందని పలువురు చెబుతున్నట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన, ఆస్ట్రేలియాలోని క్వీన్ విక్టోరియా మ్యూజియానికి చెందిన డేవిడ్ తురోగూడ్ తెలిపారు.