: నాగ్ పూర్ లో అపార్ట్ మెంట్ లో బయటపడ్డ నోట్ల కట్టలు
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో 500, 1000 నోట్ల కట్టలతో వున్న బ్యాగులను పోలీసులు పట్టుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... నాగ్ పూర్ లోని హిల్ టాప్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో భారీగా నల్లధనం ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ట్రావెల్ బ్యాగులో దాచిన 1.72 కోట్ల రూపాయల 1000 నోట్లు, 15.5 లక్షల రూపాయల 500 రూపాయల నోట్లు దొరికాయి. దీంతో వీటిని స్వాధీనం చేసుకుని, వీటికి సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉండడం విశేషం. దీనిపై పోలీసులు ఐటీ అధికారులకు సమాచారమిచ్చినట్టు తెలిపారు.