: బ్యాంకుల ముందే కాదు... అప్పుడప్పుడు రేషన్ షాపుల ముందు కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు!: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే
బ్యాంకుల ముందు ప్రజలు ప్రాణాలు విడవడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సహస్రబుద్ధే భోపాల్ కు చెందిన వినోద్ పాండ్ బ్యాంకు ముందు ప్రాణం కోల్పోవడంపై మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకుల ముందు మాత్రమే కాదు... అప్పుడప్పుడు రేషన్ షాపుల ముందు కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారని అన్నారు. అలాగని తామేమీ ప్రజా సమస్యలపై మొరటుగా స్పందించడం లేదని అన్నారు. కాగా, భోపాల్ లో వినోద్ పాండే (69), మధ్యప్రదేశ్ లో మరో ముగ్గురు క్యూ లైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, సహస్రబుద్ధే వ్యాఖ్యల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.