: నటుడు విశాల్ కు వీఎఫ్ఎఫ్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం


సినీ నటుడు విశాల్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తమిళ నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) ఈ నిర్ణ‌యం తీసుకుంది. విశాల్ తాజాగా ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో ప‌లు వ్యాఖ్య‌లు చేసినందుకు గానూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది. ఇంట‌ర్వ్యూలో నిర్మాతల మండలిపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై విశాల్ తమకు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశిస్తూ ఇటీవ‌లే తమిళ నిర్మాతల మండలి నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై విశాల్ స్పందిస్తూ టీఎఫ్ పీసీకి ఓ లేఖ ద్వారా స‌మాధానం పంపాడు. అయితే, విశాల్ ఇచ్చిన లేఖపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన కమిటీ వివరణ సరిగా లేదని తెలుపుతూ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

  • Loading...

More Telugu News