: ముందు తెలిస్తే మాత్రం ఏం చేయగలను... మహా అయితే ఐదారు లక్షలు మార్చుకునేవాడిని: చంద్రబాబు


కరెన్సీ నోట్ల మార్పిడి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. నోట్ల రద్దు గురించి తనకు కూడా ముందస్తు సమాచారం లేదని ఆయన తెలిపారు. తెలిస్తే మాత్రం ఏం చేయగలనని... మహా అయితే ఓ ఐదు లేదా ఆరు లక్షల డబ్బును మాత్రమే మార్చుకోగలనని అన్నారు. మీ వ్యక్తిగత ఖర్చుల కోసం ఎంత డబ్బు మార్చుకున్నారని మీడియా అడగ్గా... తనకు డబ్బుతో అవసరం లేదని... కారుకు డీజిల్ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తన ఇంట్లో సరిపడా కూరగాయలు ఉన్నాయని నవ్వుతూ అన్నారు.

  • Loading...

More Telugu News